రోజూ జామ పండు తింటే యంగ్‌గా క‌నిపిస్తారా?

#Guava Fruit Benefits

జామ పండ్ల‌లో పీచు, విట‌మిన్ ఏ, విట‌మిన్ సీ, ఫోలిక్ యాసిడ్ శాతం చాలా ఎక్కువ‌. పొటాషియం, కాప‌ర్, మాంగ‌నీస్ ఖ‌నిజాలు పుష్క‌లంగా ల‌భిస్తాయి.

క‌మ‌లా పండుతో పోలిస్తే జామ పండులో 4 రెట్లు ఎక్కువగా విట‌మిన్ సీ దొరుకుతుంది.

జామ కాయ‌ల్లో డ‌యేరియా, డీసెంట్రీ, గ్యాస్ట్రోంట‌రైట‌స్ వంటి వ్యాధుల్ని అరిక‌ట్టే గుణం ఉంది.

మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య ఉన్న‌వారికి ఇది మంచి మందుగా ప‌నిచేస్తుంది. ఈ కాయ‌ల్లోని పీచు కార‌ణంగా కొలెస్ట్రాల్‌, బీపీ త‌గ్గుతాయి.

బ‌రువు త‌గ్గ‌డానికి జామ దోహ‌ద‌ప‌డుతుంది. ఇందులోని కార్బొహైడ్రేట్లు జీర్ణం కావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. దీంతో పొట్ట త్వ‌ర‌గా నిండిపోతుంది.

రోజూ ఒక జాంపండు తింటే డ‌యాబెటిస్‌, ప్రొస్టేట్ క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా నివారించుకోవ‌చ్చు.

బాగా జలుబు, దగ్గు ఉన్నప్పుడు జామ ఆకుల డికాక్షన్ తాగితే త్వరగా తగ్గుతుంది.

జామకాయలు, ఆకుల్లో ఉండే యాస్ట్రింజెంట్లు చర్మానికి మంచి టానిక్‌లా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది.

పచ్చి జామకాయల జ్యూస్‌ను ఒంటికి పట్టిస్తే చర్మం శుభ్రపడి కాంతివంతమవుతుంది. 

జామ కాయ‌ల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల వృద్ధాప్య లక్షణాలు నెమ్మదిస్తాయి. వీటిలో ఉండే పీచు కారణంగా కొలెస్ట్రాల్, బీపీ తగ్గుతాయి.