దాల్చిన చెక్కతో రోగాలు మాయం

Cinnamon Health Benefits

బియ్యం క‌డిగిన నీటిలో మూడు స్పూన్లు దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే పీరియ‌డ్స్ టైమ్‌లో వ‌చ్చే నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

తలనొప్పి తగ్గాలంటే దాల్చిన చెక్కను పొడిచేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకుంటే సరిపోతుంది.

దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె కలిపి రోజూ మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

చర్మ రోగాలు, దురదలు, చెమట పొక్కులు, ఎగ్జిమా వంటి వాటిని దాల్చిన చెక్క త‌గ్గిస్తుంది.

ఇందుకోసం కొద్దిగా తేనెను వేడి చేసి అందులో కొంచెం దాల్చిన చెక్కపొడిని వేసి ఆ మిశ్రమాన్ని తీసుకున్నా, చర్మానికి రాసుకోవాలి.

రాత్రి నిద్రపోయేముందుగా గ్లాస్ పాలలో రెండు స్పూన్ల దాల్చిన చెక్కపొడి, కొద్దిగా చక్కెర వేసి తీసుకుంటే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.

ఒక్కోసారి కొంతమందికి గుండె పట్టేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ సందర్భాలలో దాల్చిన చెక్కను చూర్ణం చేసి అందులో కొద్దిగా యాలకుల పొడి వేసి నీటిలో మరిగించాలి.

ఈ మిశ్రమాన్ని కషాయం రూపంలో తీసుకుంటే వెంటనే ఉపశమనం పొందవచ్చు.