వీళ్లు స్ట్రాబెర్రీని అస్స‌లు తినొద్దు

Straw Berry Health Benefits

స్ట్రాబెర్రీలో ఉండే విట‌మిన్ సీ రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

ఇందులోని పొటాషియం, మెగ్నీషియం హైప‌ర్ టెన్ష‌న్‌ను త‌గ్గిస్తుంది. హృద‌య కండ‌రాలు గ‌ట్టిప‌డ‌టాన్ని అడ్డుకుంటాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా స‌వ్యంగా సాగుతుంది.

స్ట్రాబెర్రీలోని యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డాన్ని నివారించి, గుండెపోటు ప్ర‌మాదం నుంచి కాపాడుతాయి.

బ‌రువు త‌గ్గాల‌ని అనుకునేవారికి స్ట్రాబెర్రీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇందులో కొవ్వు క‌రిగించే లెప్టిన్‌, అడిపోనెక్టిన్ వంటి హార్మోన్స్ ఉంటాయి. ఇవి ఆక‌లిని త‌గ్గించి రక్తంలోని చ‌క్కెర శాతం పెర‌గకుండా చూస్తాయి.

గ‌ర్భిణుల‌కు అవ‌స‌ర‌మైన ఫోలిక్ యాసిడ్ ఇందులో పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఇది పుట్ట‌బోయే బిడ్డ‌లో లోపాలు ఏర్ప‌డ‌కుండా చూస్తుంది.

ఎర్ర ర‌క్త‌క‌ణాలు వృద్ధి చెంద‌డానికి, మెద‌డు ప‌నితీరు మెరుగుప‌ర‌చ‌డానికి స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంది.

స్ట్రాబెరీలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను రిలాక్స్ చేస్తాయి. రక్తపీడనాన్ని తగ్గించి, గుండె సంబంధ వ్యాధుల్ని నివారిస్తాయి.

రోజూ 10 నిమిషాల చొప్పున వారం పాటు క‌ళ్ల మీద స్ట్రాబెర్రీ ముక్క‌లను ఉంచితే న‌ల్ల‌టి వ‌ల‌యాలు పోతాయి.

స్ట్రాబెర్రీలోని విట‌మిన్ సీ కంటిచూపు మెరుగుప‌ర‌చ‌డానికి ఉపయోగ‌ప‌డుతుంది.

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్స‌ర్ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతాయి.

చ‌ర్మంపై ద‌ద్దుర్లు, త‌ల‌నొప్పి, నిద్ర‌లేమి, అల‌ర్జీ వంటి స‌మ‌స్య‌లు ఉన్న వారు మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లోనూ స్ట్రాబెర్రీ తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు.