Jasmine
మత్తెక్కించే మల్లెలతో ఎన్ని లాభాలంటే?
Beauty Benefits
పువ్వుల్లో మల్లెలదే అగ్రస్థానం. అలాంటి మల్లె పూలను ఇష్టపడని మహిళలు ఉండరు. మల్లెలు అందించే కొన్ని సౌందర్య పరమైన ప్రయోజనాలు..
మల్లెపూలు నీటిలో వేసుకుని గంట తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే శరీరం, మనసు తేలికపడతాయి. పూల సువాసనతో ఒళ్లు గుబాళిస్తుంది.
రోజంతా బయట తిరగడం వల్ల ఒత్తిడికి లోనైన కళ్ల మీద విరిసిన మల్లెపూలను ఉంచితే ఒత్తిడి తగ్గిపోతుంది.
కొందరికి ఏళ్లుగా చుండ్రు బాధిస్తూనే ఉంటుంది. అలాంటి వారు మెంతులు, కాసిన్ని నీళ్లు, ఎండు మల్లెలు కలిపి నూరాలి.
ఆ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే సమస్య తగ్గడమే కాకుండా జుట్టు దృఢపడుతుంది.
మల్లె పూలను కొబ్బరినూనెలో వేసి రాత్రంతా నానబెట్టి, ఆ తర్వాత మరగనిచ్చి ఆ నూనెను పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
మాడు చల్లబడుతుంది. జుట్టు దృఢంగా కూడా తయారవుతుంది.
గుప్పెడు విచ్చిన మల్లెల్ని నూరి ముద్ద చేసి కొద్దిగా పాలు కలిపి ముఖమంతా మర్దన చేసుకోవాలి.
ఆ తర్వాత అరచెంచా చొప్పున ముల్తానామట్టి, గంధం, తేనె కలిపి ఫేస్‌ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా మారి మెరిసిపోతుంది.
రెండు చెంచాల చొప్పున మల్లెపూల రసం, గులాబీ పువ్వుల రసం, గుడ్డు పచ్చ సొన కలిపి ముఖానికి పట్టిస్తే ముఖ చర్మం మెత్తబడి కాంతివంతంగా మారుతుంది.
మల్లెల నూనెను మొటిమెల మీద రాసి మర్దన చేస్తే ఆ మచ్చలు మాయమైపోతాయి.