స‌మంత‌తో బాలీవుడ్‌లో ఓ సినిమా తీస్తానంటున్న హీరోయిన్‌

samantha ruth prabhu

సినిమాల విష‌యంలో స‌మంత ఇప్పుడు దూకుడు పెంచింది. Magazine

నాగచైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు క‌మిట్ అవుతూ బిజీగా మారిపోయింది.

samantha

కేవ‌లం తెలుగులోనే కాకుండా త‌మిళం, హిందీలోనూ ఈమెకు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌లో న‌టించిన స‌మంత‌.. ఇప్పుడు సినిమాలు కూడా ఒప్పుకుంటుంది.

ఈ క్ర‌మంలోనే తాప్సీ నిర్మాణంలో బాలీవుడ్‌లో ఒక సినిమా చేయ‌బోతోంది.

Tapsee Pannu

నేష‌న‌ల్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో తాప్సీనే ఈ విష‌యాన్ని క‌న్ఫార్మ్ చేసింది.

Tapsee Pannu

మిథాలీ రాజ్ బ‌యోగ్ర‌ఫీ ఆధారంగా రూపొందిన శ‌భాష్ మిథూ సినిమాలో తాప్సీ లీడ్ రోల్‌లో న‌టించింది.

ఈ సినిమా జూలై 15న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. త‌న అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్‌ల గురించి చెప్పుకొచ్చింది.

త్వ‌ర‌లో స‌మంత లీడ్ రోల్‌లో బాలీవుడ్‌లో ఓ సినిమా నిర్మిస్తున్నాన‌ని తాప్సీ ప్ర‌క‌టించింది.

ఒక‌వేళ అవకాశం ఉంటే తాను కూడా ఒక పాత్ర‌లో న‌టిస్తాన‌ని చెప్పుకొచ్చింది.

ఏదేమైనా స‌మంత‌తో క‌లిసి సినిమా తీస్తాన‌ని మ‌రో హీరోయిన్ ముందుకు రావ‌డం చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.