SRi Ramanavami

శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టే పాన‌కం, వ‌డప‌ప్పు తింటే ఎన్ని లాభాలో !!

పిబరే రామరసం! రామనామం పాలుమీగడలు, పంచదారతేనెల కంటే కూడా కడు తీయని రసం! నవమి వేడుకల నైవేద్యమైన పానకం కూడా రామనామమంత మధురంగా ఉంటుంది. ఇక వడపప్పు రుచి మనకు తెలిసిందే! ఈ రెండు నైవేద్యాలకూ అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. 

పానకంలో బెల్లం, మిరియాల పొడి, శొంఠి పొడి, యాలకుల పొడి వాడతారు. అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే.

బెల్లంలో ఐరన్‌, మెగ్నీషియం, పాస్ఫరస్‌, పొటాషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.

మిరియాలు, శొంఠి జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తాయి. యాలకులు నోటి దుర్వాసనను పోగొడతాయి. అన్నీ కలిసి అన్నవాహిక, కడుపు, పేగులను శుభ్రపరుస్తాయి.

వడపప్పులో ఉండే పెసరపప్పు, మామిడి తురుము, కొబ్బరి తురుము, కొత్తిమీర వంట్లో వేసవి వేడిని తగ్గిస్తాయి.

పెసరపప్పులోని ఐరన్‌, పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

వడపప్పు రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియనూ వృద్ధి చేస్తుంది.