అమ్మ పాత్ర‌లు చేయ‌మంటున్నారు

Aparna Balamurali

ఆకాశ‌మే హ‌ద్దురా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు దగ్గ‌రైంది అప‌ర్ణ బాల‌ముర‌ళి.

Aparna Balamurali

త‌మిళంలో సూరారై పోట్రు టైటిల్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాతో జాతీయ అవార్డు కూడా అందుకుంది అప‌ర్ణ‌.

Aparna Balamurali

నిజానికి ఈ సినిమా కంటే ముందు మ‌ల‌యాళంలో, త‌మిళంలో చాలా సినిమాలే చేసింది. కానీ సూరారి పోట్రుతో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకుంది.

Aparna Balamurali

హీరోయిన్ అంటే స్లిమ్‌గానే ఉండాల‌ని లేదు.. టాలెంట్ ఉండి బొద్దుగా ఉన్న ఫ‌ర్వాలేద‌ని నిరూపించింది అప‌ర్ణ‌.

అయితే ఇటీవ‌ల అప‌ర్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆమె న‌టిస్తున్న ఆరుదానం సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్‌ రిలీజ్ చేశారు.

ఈ పోస్ట‌ర్‌లో అప‌ర్ణ లావైనట్లు క‌నిపించడంతో ఆమెపై ట్రోలింగ్స్ మొద‌ల‌య్యాయి.

ఇవి చూసిన అప‌ర్ణ బాల‌ముర‌ళి.. త‌న‌పై వ‌స్తున్న ట్రోలింగ్స్‌, బాడీ షేమింగ్ కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యింది.

బొద్దుగా ఉన్నాన‌ని.. లావ‌య్యాన‌ని వ‌స్తున్న కామెంట్స్‌ను చూసి చాలా బాధ‌ప‌డ్డాన‌ని అప‌ర్ణ తెలిపింది.

ఇంకా కొంద‌రైతే అమ్మ పాత్ర‌లో న‌టిస్తావా? అని అడుగుతున్నారు.. కానీ నా వ‌య‌సు అమ్మ పాత్ర‌ల్లో న‌టించే అంత ఏమీ లేద‌ని చెప్పింది.

కొంద‌రు స‌న్న‌గా ఉంటేనే హీరోయిన్లుగా భావిస్తారు? స‌న్న‌గా ఉంటేనే హీరోయిన్‌గా ఛాన్స్ దొరుకుతుంద‌ని ఎందుకు అంటున్నారో అర్థం కావ‌ట్లేద‌ని పేర్కొంది.

నేను బొద్దుగా ఉన్నా స‌రే.. చాలామంది త‌మ సినిమాల్లో న‌టించ‌మ‌ని అడుగుతున్నార‌ని.. ఎలా ఉన్నా అంగీక‌రిస్తున్నార‌ని స్ప‌ష్టం చేసింది.

శ‌రీర బ‌రువుకు, ప్ర‌తిభ‌కు సంబంధ‌మే లేద‌ని చెప్పుకొచ్చింది అప‌ర్ణ బాల‌ముర‌ళి.

ధనుష్‌, విజ‌య్ సేతుప‌తి వంటి న‌టులు రూపంలో ఎలా ఉన్నా.. వాళ్ల న‌ట‌న ముందు అవేవీ గుర్తురావు కదా అని చెప్పింది.

త‌న‌ దృష్టిలో ప్ర‌తిభ‌కు, రూపానికి సంబంధం లేద‌ని స్ఫ‌ష్టం చేసింది అప‌ర్ణ బాల‌ముర‌ళి.