తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది.
సినీ ఇండస్ట్రీలో ఉన్నానని.. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తన వృత్తిని గౌరవించడంతో పాటు తనకు అండగా ఉండే వ్యక్తినే పెండ్లి చేసుకుంటానని చెప్పింది.
ఒకవేళ అలాంటి వ్యక్తి దొరక్కపోతే పెండ్లి చేసుకోనని మృణాల్ ఠాకూర్ స్పష్టం చేసింది.
తనకు పెండ్లిపై పెద్దగా ఆసక్తి లేదని.. కానీ పిల్లలు అంటే ఇష్టమని చెప్పింది.