న‌న్ను పెళ్లి చేసుకుంటే..  24గంట‌లు అదే చేయాలి

#Shehnaaz Gill

బిగ్‌బాస్ షోతో పాపులారిటీని సంపాదించుకుంది షెహ‌నాజ్ గిల్‌.

అప్ప‌టివ‌ర‌కు మ్యూజిక్ ఆల్బ‌మ్స్‌తో అల‌రించిన షెహ‌నాజ్ బిగ్‌బాస్ హిందీ సీజ‌న్ 13తో మంచి పేరు తెచ్చుకుంది.

Green Star

Shehnaaz Gill

ఆ షోలో సెకండ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన షెహ‌నాజ్.. ఆ త‌ర్వాత సీజ‌న్ల‌లో గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇచ్చి ఆక‌ట్టుకుంది.

Green Star

Shehnaaz Gill

మొత్తంగా బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రైంది. తాజాగా మ‌సాబా మ‌సాబా సీజ‌న్ 2 వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్‌లో పాల్గొంది.

Green Star

Shehnaaz Gill

ఈ ప్ర‌మోష‌న్‌లో ఒక అభిమాని షెహ‌నాజ్ ముందు పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టాడు. త‌న‌ను పెళ్లిచేసుకుంటావా అని అడిగాడు.

Green Star

Shehnaaz Gill

ఊహించ‌ని ఈ ప్ర‌శ్న‌కు షెహ‌నాజ్ గిల్ కూడా విచిత్ర‌మైన స‌మాధానం చెప్పింది.

నా ముందు పెళ్లి ప్రపోజ‌ల్ పెడుతున్నారు స‌రే ముందు మీ బ‌యోడేటా పంపించ‌డం అని షెహ‌నాజ్ అడిగింది.

Green Star

Shehnaaz Gill

అంత‌టి ఆగ‌కుండా త‌న‌తో వేగ‌డం అంత ఈజీ కాదని చెప్పుకొచ్చింది షెహ‌నాజ్‌. అందుకు కార‌ణం వివ‌రించింది.

Green Star

Shehnaaz Gill

త‌న‌కు ఎదుటివారు చెప్పేది వినేంత ఓపిక ఉండ‌ద‌ని.. 24 గంట‌లు పొగుడుతూనే ఉండాల‌ని చెప్పుకొచ్చింది.

Green Star

Shehnaaz Gill

అలాగే రోజంతా వాగుతూనే ఉంటాన‌ని.. మీరు దాన్ని వింటూనే ఉండాల‌ని తెలిపింది.

Green Star

Shehnaaz Gill

తన గురించి ఎప్పుడూ ఏదో ఒక‌టి మాట్లాడుతూనే ఉండాల‌ని.. ఒక‌వేళ మాట్లాడ‌టం ఆపేస్తే మ‌ధ్య‌లోనే వెళ్లిపోతాన‌ని పేర్కొంది.

Green Star

Shehnaaz Gill

అందుకే త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని క‌ల‌లు క‌న‌డం మానేయాల‌ని స‌ల‌హా ఇచ్చింది షెహ‌నాజ్ గిల్‌