నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన సమంత

చాలా రోజుల తర్వాత శాకుంతలం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ కోసం మీడియా ముందుకొచ్చింది సమంత.

samantha

ఇలా మీడియా ముందుకొచ్చిన సమంతను చూసి ఫ్యాన్స్‌ ఖుషీ అయిపోయారు. కానీ ఆమె ఉన్న పరిస్థితి చూసి కొంతమంది అయ్యో అని అనుకున్నారు.

ఈ క్రమంలో తనపై వస్తున్న నెగెటివ్‌ కామెంట్స్‌పై సమంత స్పందించింది.

సమంతను చూస్తే జాలేస్తుంది. ఆమె తన అందం, కళ రెండూ కోల్పోయింది. అని ఓ నెటిజన్‌ మీమ్‌ పోస్టు చేశాడు

విడాకుల తర్వాత ధైర్యంగా కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరిందని ఆశిస్తున్న సమయంలోనే మయోసైటిస్‌ ఆమెను మళ్లీ అశక్తిరాలిని చేశాయి. అంటూ అందులో పేర్కొన్నాడు

ఈ పోస్టుకు సమంత చాలా స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చింది. 

నాలాగా నెలలతరబడి చికిత్స తీసుకునే పరిస్థితి నీకు రావద్దని కోరుకుంటున్నా.. నువ్వు మరింత వెలిగిపోయేలా నా ప్రేమను కొంచెం పంపిస్తున్నా అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చింది.

samantha