అదేంటి?.. విషం ప్రాణం తీస్తుందిగా..  ఔషధం ఎలా అవుతుందనేగా మీ డౌట్‌

విషం అంటే సాధారణంగా ప్రాణం తీసుంది. కానీ అదే విషం కొన్నిసార్లు ప్రాణాలు  కాపాడే ఔషధం కూడా

అలాంటిదే ఈ 'డెత్‌స్టాకర్‌' తేలు విషం

ఇది ఎంత ప్రమాదకరమో అంత విలువైనది కూడా

 ద్రవ పదార్థాల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది  ఈ తెలు విషం

లీటరు తేలు విషం  అక్షరాలా రూ.84  కోట్లు

తేలు విషంలో  మనిషి నాడీ వ్యవస్థ ను దెబ్బదీసే  న్యూరో టాక్సిన్లు,  క్లోరో టాక్సిన్‌లు  ఉంటాయి

ఈ న్యూరో టాక్సిన్లు,  క్లోరో టాక్సిన్లు  కొన్ని రకాల  వైద్య చికిత్సల్లో వాడుతారు

 క్లోరో టాక్సిన్‌లను మెదడు కేన్సర్‌ చికిత్సలో వాడుతారు. కేన్సర్‌కు చికిత్స చేసి తొలగించగా మిగిలిపోయిన కేన్సర్‌ కణాలను పూర్తిగా తొలగించడానికి తేలు విషయంలోని క్లోరో టాక్సిన్‌లు వాడుతారు.

ఇంత విలువైన, ఖరీదైన తేలు విషం కోసం కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా తేళ్లను పెంచుతారట.

ప్రత్యేకంగా తయారు చేసిన పరికరం ద్వారా   తేళ్లనుంచి విషాన్ని తీస్తారట. ఒక లీటరు విషం సేకరించాలంటే సుమారు 14 లక్షల తేళ్లు అవసరమవుతాయట

క్లోరో టాక్సిన్‌ను మార్కర్‌గా వాడి మెదడుకు సోకిన కేన్సర్ కణాలు పూర్తిగా తొలగించడం వల్ల ఆ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.  లేకపోతే తిరగబెట్టే అవకాశముంటుంది.