బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ నుంచి సమంత తప్పుకుందా?

మయోసైటిస్‌తో బాధపడుతున్నట్టు సమంత ప్రకటించినప్పటి నుంచి ఆమెపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంది.

SAMANTHA

ప్రస్తుతం సమంత చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ సినిమాలు వెబ్‌ సిరీస్‌లు కూడా ఉన్నాయి.

ఇలాంటి టైమ్‌లో అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం యాక్టింగ్‌ నుంచి కొంతకాలం బ్రేక్‌ తీసుకుంది.

దీంతో సమంత పలు ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు ఎక్కువయ్యాయి. 

ఈక్రమంలోనే రాజ్‌ డీకే దర్శకత్వంలో తెరకెక్కితున్న సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ నుంచి కూడా తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఫ్యామిలీమ్యాన్‌ వెబ్‌ సిరీస్‌తో తనను బాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకులతోనే మరో స్పై థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ చేసేందుకు సామ్‌ ఒప్పుకుంది.

samantha

samantha

ఈ వెబ్‌ సిరీస్‌లో బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అయితే అనారోగ్య కారణంతో ఈ ప్రాజెక్టు నుంచి సామ్‌ తప్పుకున్నట్టు నెట్టింట జోరుగా టాక్ నడుస్తోంది.

ఈ క్రమంలో సిటాడెల్‌ టీమ్‌ నుంచి ఒక అప్‌డేట్‌ వచ్చింది. ఈ ప్రాజెక్టు నుంచి సామ్‌ను తొలగించినట్టు వచ్చిన వార్తలు అబద్దాలేనని తెలుస్తోంది.

జనవరి మధ్యలో సామ్‌ ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లో జాయిన్‌ అవ్వనున్నట్టు సమాచారం.