మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించిన తర్వాత తొలిసారిగా సమంత మీడియా ముందుకొచ్చింది.
ఇంతటి అనారోగ్యంలో కూడా యశోద సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ.. తన డెడికేషన్‌ను చూపించింది.
యశోద సినిమా ప్రమోషన్‌లో భాగంగా సినిమా విశేషాలతో పాటు తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించింది సామ్.
నేను ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నానని రాశారు.. కానీ ప్రస్తుతం నేను ఉన్న స్టేజి ప్రాణాంతకమైనది మాత్రం కాదని సమంత స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి చావలేదని.. అలాంటి హెడ్డింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదని సమంత తెలిపింది. ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నానని పేర్కొంది.
సోషల్‌మీడియాలో పోస్టు చేసినట్టుగా జీవితంలో కొన్ని మంచి, మరికొన్ని చెడు రోజులు ఉంటాయని తెలిపింది.
ఒక్కోరోజు ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అని అనిపిస్తోందని.. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఇంత దూరం వచ్చానా? అని అనిపిస్తోందని భావోద్వేగానికి గురైంది.
సాధారణంగా సినిమా ఓకే చేయడానికి ఒక్కరోజు సమయం తీసుకుంటా.. కానీ యశోద సినిమా వెంటనే ఓకే చేశానని చెప్పింది.
కథ విన్నప్పుడు గూస్‌బంప్స్ వచ్చాయి.. చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అదేవిధంగా థ్రిల్ అవుతారని సమంత చెప్పుకొచ్చింది.
యశోద సినిమాకు నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పాలని ముందు నుంచే డిసైడ్ అయ్యానని.. అందుకే సెలైన్ బాటిల్‌తో డబ్బింగ్ చెప్పానని తెలిపింది.