సాయిపల్లవి సినిమాలకు గుడ్‌ బై చెప్పనుందా?

సాయిపల్లవికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోలకు ఉన్నంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అందుకే సాయిపల్లవిని లేడీ పవర్‌ స్టార్‌ అని పిలుస్తుంటారు. 

మిగిలిన హీరోయిన్లలా గ్లామర్‌ పాత్రలను కాకుండా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ తన పాపులారిటీని మెయింటైన్‌ చేస్తోంది. 

చివరగా గార్గి చిత్రంతో వచ్చిన సాయిపల్లవి గురించి ఇప్పుడు ఒక వార్త ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.

సాయిపల్లవి సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.

ఈ ఏడాది విరాటపర్వం, గార్గి చిత్రాలతో వచ్చిన సాయిపల్లవి కొంతకాలంగా ఏ సినిమాలను ఒప్పుకోవడం లేదు. 

స్టార్‌ హీరోల పక్కన హీరోయిన్‌గా ఆఫర్లు వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరిస్తుంది. దీంతో సినిమాలను వదిలేస్తుందని వార్తలు వస్తున్నాయి.

మెడిసిన్‌ చేసిన సాయిపల్లవి కోయంబత్తూరులో ఒక హాస్పిటల్‌ నిర్మిస్తోంది.

తన చెల్లె పూజతో కలిసి ఈ హాస్పిటల్‌ను చూసుకోబోతుందని.. అందుకే సినిమాలు వదిలేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి.  సాయిపల్లవి పెండ్లి చేసుకోబోతుందని అందుకే సినిమాలు వదిలేస్తోందని పుకార్లు వచ్చాయి.

వాటిలో నిజం లేదని సాయిపల్లవి క్లారిటీ ఇవ్వడంతో కొద్దిరోజులు ఈ వార్తలు సద్దుమణిగాయి. 

తాజాగా మళ్లీ సాయిపల్లవి సినిమాలకు దూరంగా కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.