అప్పుడు సమంత..  ఇప్పుడు రష్మిక..

మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే ఐటెం సాంగ్‌ చేసి అందరికీ షాకిచ్చింది సమంత.

పూజా హెగ్డే కూడా కెరీర్‌ దూకుడు మీద ఉన్నప్పుడే రంగస్థలం, ఎఫ్‌3 సినిమాల్లో ఐటెం సాంగ్స్‌ చేసింది.

ఇప్పుడు వీళ్ల బాటలోనే స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేసేందుకు రష్మిక మంధన్న సిద్ధమైంది.

పుష్ప సినిమాతో నేషనల్‌ క్రష్‌గా మారిన రష్మిక.. సౌత్‌ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌ నుంచి వరుస ఆఫర్లు అందుకుంటుంది.

చేతి నిండా సినిమాలు ఉన్న ఈ టైమ్‌లో కూడా ఐటెం సాంగ్‌ చేసేందుకు రష్మిక గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ ఎంజాయ్‌ చేస్తున్న టైమ్‌లో ఐటెం సాంగ్స్‌ చేసే ట్రెండ్‌ను శ్రియ మొదలుపెట్టింది.

శ్రియ తర్వాత అనుష్క, కాజల్‌ తమన్నా, శృతిహాసన్‌, పూజా హెగ్డే, సమంత ఈ ట్రెండ్‌ను కొనసాగించారు.

ఇప్పుడు వీళ్ల బాటలోనే రష్మిక కూడా ఐటెం సాంగ్‌ చేసేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం.