విజ‌య్‌తో రిలేష‌న్‌పై క్లారిటీ ఇచ్చిన ర‌ష్మిక‌

పుష్ప సినిమాతో ఒక్క‌సారిగా నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారిపోయింది క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న‌.

పుష్ప త‌ర్వాత బాలీవుడ్‌లో కూడా ఆఫ‌ర్లు అందుకుంటూ బిజీ బిజీగా మారిపోయింది.

తాజాగా ర‌ష్మిక బాలీవుడ్ డెబ్యూ మూవీ గుడ్‌బై విడుద‌లై మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఈ క్ర‌మంలో ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌ష్మిక‌ను.. ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంట‌ని అడ‌గ‌డంతో ఆస‌క్తిక‌ర స‌మాధాన‌మిచ్చింది.

నిజానికి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ర‌ష్మిక ల‌వ్‌లో ఉన్న‌ట్లు కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కానీ వీటిపై ఇద్ద‌రూ స్పందించ‌లేదు.

ఈ క్ర‌మంలో ఎవ‌రితోనైనా రిలేష‌న్‌లో ఉన్నారా అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ర‌ష్మిక ఇచ్చిన జ‌వాబు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్రేమ‌లో ఉంటే ఆ బంధాన్ని నిలుపుకోవ‌డానికి చాలా త్యాగాలు చేయాల‌ని ర‌ష్మిక తెలిపింది.

ముఖ్యంగా త‌గినంత స‌మ‌యాన్ని కేటాయించాల్సి ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది.

ప్రేమ‌ను నిల‌బెట్టుకోవ‌డం అంత సుల‌భం కాదు.. అందుకు చాలా స‌హ‌నం కావాల‌ని పేర్కొంది.

ప్ర‌స్తుతం సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాన‌ని.. ప్రేమించేంత టైమ్ లేద‌ని స్ప‌ష్టం చేసింది.

వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఫ్యామిలీతో గ‌డిపేందుకే స‌మ‌యం చిక్క‌డం లేద‌ని చెప్పుకొచ్చింది.

ఇప్ప‌టికే ఇంట్లో అందుబాటులో ఉండ‌టం లేద‌ని ఫ్యామిలీ మెంబ‌ర్స్ బాధ‌ప‌డుతుంటారని వాపోయింది.

ప్ర‌స్తుతానికి ఎవ‌రితో రిలేష‌న్‌లో లేన‌ని.. ఎవ‌రినైనా ప్రేమిస్తే ఆ విష‌యాన్ని ముందుగానే వెల్ల‌డిస్తాన‌ని చెప్పుకొచ్చింది.