Hair fall

Monosson 

Rain

Monsoon

Beauty tips

వానాకాలంలో  మీ జుట్టును ఇలా కాపాడుకోండి

వానాకాలంలో త‌డిచిన జుట్టు ప‌ట్ల జాగ్ర‌త్త‌గా లేక‌పోతే ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. కాబ‌ట్టి వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి.

వానాకాలంలో జుట్టుతో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. గజిబిజి జుట్టు, దురద, మురికి, వెంట్రుకలు రాలడం ఇవి ప్రధానమైనవి. వీటినుంచి విముక్తి పొందడానికి జాగ్రత్తలు తప్పనిసరి.

చర్మానికి కావాల్సినట్టే వెంట్రుకలకు కూడా హైడ్రేషన్ అవసరం. అందుకే వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి.

జుట్టు తడిగా ఉన్నప్పుడు అసలే దువ్వకూడదు. కట్టి వేయకూడదు కూడా. పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వడం కానీ, కట్టడం కానీ చేయాలి.

కచ్చితంగా జుట్టు కట్టాలి అనుకుంటే పోనీటేల్ మాత్రమే వేసుకోండి.

White Bag

ఈ కాలంలో ముఖ్యంగా భిన్నమైన హెయిర్ స్టైల్‌కు దూరంగా ఉండటం మంచిది. సాధారణ శైలిలోనే జుట్టును ఉంచుకోవాలి

హెయిర్ డ్రైయర్లను వాడటం, రంగులు వేయడం తగ్గిస్తే మంచిది.

వర్షం నీటివల్ల జుట్టులోకి మురికి చేరే అవకాశం ఉంది. సరైన షాంపును ఎంచుకొని దాన్ని తొలగించాలి. ఎక్కువ షాంపు వాడటం కూడా మంచిది కాదు.

White Bag

వారానికి రెండుసార్లు అయినా ఆయిల్ మసాజ్ చేసుకోవడం మంచిది. దీనివ‌ల్ల‌ వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా తయారవుతాయి.