వాళ్లిద్ద‌రూ చాలా ఇష్ట‌మంటున్న ప్రియాంక జ‌వాల్క‌ర్‌

Priyanka Jawalkar

టాక్సీవాలా సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది ప్రియాంక జ‌వాల్క‌ర్‌.

Priyanka Jawalkar

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వ‌చ్చిన ఈ సినిమాతో మంచి గుర్తింపే తెచ్చుకున్న‌ప్ప‌టికీ అవ‌కాశాలు మాత్రం పెద్ద‌గా రాలేదు.

కుర్ర హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రంతో క‌లిసి గ‌త ఏడాది SR క‌ల్యాణ‌మండపం సినిమాతో మ‌రో హిట్ కొట్టింది..

అప్ప‌ట్నుంచైనా ఈ అనంత‌పురం అమ్మాయికి వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తాయ‌ని అనుకున్నారు.

కానీ గ‌మ‌నం త‌ర్వాత ప్రియాంక జ‌వాల్క‌ర్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

Priyanka Jawalkar

ఇలాంటి స‌మ‌యంలో త‌మిళ హీరోలు ధ‌నుష్‌, శింబు అంటే త‌న‌కు క్ర‌ష్ అని ప్రియాంక చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

తాజాగా ప్రియాంక జ‌వాల్క‌ర్‌ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌లో పాల్గొంది.

Priyanka Jawalkar

ఈ సంద‌ర్భంగా మీ కోలీవుడ్ క్ర‌ష్ అని ఎవ‌రు అని ఒక అభిమాని ప్ర‌శ్నించ‌గా ప్రియాంక స‌మాధాన‌మిచ్చింది.

ధ‌నుష్ అంటే విప‌రీత‌మైన ఇష్ట‌మ‌ని.. కొన్ని కార‌ణాల వ‌ల్ల శింబును కూడా ఇష్ట‌ప‌డుతున్న‌ట్టు చెప్పింది.

అంత‌టితో ఆగ‌కుండా ధనుష్‌, శింబు ఇద్ద‌రూ క్యూట్ పీప్స్ అని ప్రియాంక జ‌వాల్క‌ర్ చెప్పుకొచ్చింది.

ఇక కొంద‌రు అభిమానులైతే త్వ‌ర‌లోనే ప్రియాంక జవాల్క‌ర్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల‌ని కోరారు.

దీంతో కోలీవుడ్‌లో అవ‌కాశాల కోస‌మే ధ‌నుష్‌, శింబు పేర్ల‌ను ప్రియాంక చెప్పింద‌ని నెటిజన్లు విమ‌ర్శిస్తున్నారు.

టాక్సీవాలా ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ అంటే త‌న‌కు క్ర‌ష్ అని చెప్పిన‌ప్పుడు కూడా ఇలాంటి విమ‌ర్శ‌లే వ‌చ్చాయి.