health tips

గర్భిణులు జర్నీ చేయడం క్షేమమేనా?

గర్భిణులు దూర ప్రయాణం చేయకూడదని అంటారు. అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే? విమానం, రైలు, కారు.. ఎలా వెళ్లాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

కొన్ని విమానయాన సంస్థలు 28 వారాలు దాటిన గర్భిణులను అనుమతించవు. డాక్టర్‌ నుంచి అనుమతి పత్రం తీసుకొస్తే.. 36 వారాల వరకూ అనుమతినిస్తున్నాయి.

కాబోయే అమ్మలు మధ్య వరుసలోని చివరిసీటు ఎంచుకోవడం ఉత్తమం. దీనివల్ల వాష్‌రూమ్‌కు వెళ్లిరావడానికి వీలుగా ఉంటుంది.

తరచూ మంచినీళ్లు, పండ్లరసాలు తాగాలి. సీట్‌బెల్ట్‌ తప్పక ధరించాలి.

36 వారాల వారికి రైలు బండి సురక్షితమే. దూర ప్రయాణాలైతే స్లీపర్‌ కోచ్‌లో, అదీ లోయర్‌ బెర్త్‌ ఎంచుకోవాలి.రద్దీ సమయాల్లో మాత్రం ప్రయాణం శ్రేయస్కరం కాదు.

కారులో అయితే వెనుక సీట్లో కూర్చోవాలి. సీట్‌ బెల్ట్‌ ధరించాలి. కాళ్లు చాపుకోవడానికి స్థలం ఉంటే మంచిది. మధ్య మధ్యలో ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అన్నం తింటే వాంతులయ్యే ప్రమాదం ఉంది.

విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో దొరికే ఆహారం నాణ్యమైంది కాకపోవచ్చు. ఇంటి నుంచే స్నాక్స్‌, భోజనం తీసుకెళ్లడం ఉత్తమం. ప్రయాణంలో డ్రైఫ్రూట్స్‌, పండ్లు తినొచ్చు.

రిపోర్ట్‌లు, ప్రిస్క్రిప్షన్లు, మందులు వెంట తీసుకెళ్లాలి. మరీ బరువైన లగేజీ మోసే ప్రయత్నం వద్దు. తోడుగా ఎవరైనా ఉండేలా చూసుకోవాలి.