గ్లామర్‌ షో అందుకే చేస్తున్నా: పూనమ్‌ బజ్వా

చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ పూనమ్‌ బజ్వా  తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. 

అప్పుడెప్పుడో 2005లో నవదీప్‌ హీరోగా వచ్చిన మొదటి సినిమా అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. 

ఆ తర్వాత బాస్‌, పరుగు సినిమాలతో టాలీవుడ్‌ ఆడియన్స్‌కు దగ్గరైంది. ఈమెకు మంచి ఆఫర్లే వస్తాయని అనుకున్న టైమ్‌లో కోలీవుడ్‌కు జంప్‌ అయ్యింది.

తెలుగు సినిమాలను పక్కనపెట్టేసి.. తమిళం, కన్నడ, మలయాళ సినిమాలకే పరిమితమైంది. కానీ అక్కడ స్టార్‌ స్టేటస్‌ అందుకోలేకపోయింది.

సినిమాల్లో సక్సెస్‌ లేకపోయినప్పటికీ ప్రేక్షకులకు దగ్గరగా ఉండేందుకు సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది పూనమ్‌ బజ్వా.

ఎప్పటికప్పుడు పూనమ్‌ బజ్వా తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. 

Poonam Bajwa

ఇలా సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలు షేర్‌ చేయడంపై పూనమ్‌ బజ్వా తాజాగా స్పందించింది.

ఫేస్‌బుక్‌లో దక్షిణాది నుంచి ఎక్కువమంది ఫ్యాన్స్‌ ఉన్నారని.. వాళ్లంతా తనను చాలా గ్లామరస్‌గా చూసేందుకు ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చింది. 

 ఆ ఫొటోలు చూసి వాళ్లు ఎంజాయ్‌ చేస్తున్నారు కాబట్టే గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తున్నానని స్పష్టం చేసింది. 

గ్లామర్ షోకి.. స్కిన్‌ షోకి చాలా వ్యత్యాసం ఉందని పూనమ్‌ బజ్వా తెలిపింది. 

తాను గ్లామర్‌ షో మాత్రమే చేస్తున్నానని.. ఎప్పుడూ పరిధి దాటి ప్రవర్తించలేదని క్లారిటీ ఇచ్చింది.

ఇటీవల సోషల్‌మీడియాలో బోల్డ్‌ ఫొటోలు షేర్‌చేయడంపై బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చింది.

ఇన్‌స్టాలో షేర్‌ చేసే ఫొటోలను ఎక్కువమంది ఫ్యాన్స్‌ ఇష్టపడుతున్నారని.. వాటితో తన ఈఎంఐలు ఈజీగా కట్టేస్తున్నానని పేర్కొంది జాన్వీకపూర్