పెట్‌ కల్చర్‌ స్టేటస్‌ సింబల్‌. విదేశీ పెట్స్‌ ఒక ట్రెండ్‌.

పెట్‌ కల్చర్‌ స్టేటస్‌ సింబల్‌. విదేశీ పెట్స్‌ ఒక ట్రెండ్‌.

జంతు ప్రేమికులకు అందమైన జ్ఞాపకాలను పంచుతున్నది.. పెట్‌ ఫొటోగ్రఫీ.

పెట్స్‌ ఫొటోగ్రఫీ అంత సులభం కాదు. వాటిని నవ్వించాలి, ఎగిరించాలి.

అయినా, పెట్‌ ఫొటోగ్రఫీపై ఆసక్తి కనబరుస్తున్నారు.

ప్రతిమ, ఆయేషా, సలోనీ, కృతి, రీతూ వంటి యువతులు ఈ కోవకు చెందినవారే.

హైద‌రాబాద్‌కు చెందిన ప్ర‌తిమ‌కు చిన్న‌ప్ప‌టి నుంచి ఫొటోగ్ర‌ఫీ ఇష్టం.

త‌న కుక్క పిల్ల ఫాక్స్‌ను అందంగా ముస్తాబు చేసి ఫొటోలు తీస్తూ మురిసిపోయేది.

కానీ ఫాక్స్ చ‌నిపోవ‌డం ప్ర‌తిమ‌కు బాధ క‌లిగించింది. దాన్ని త‌ల‌చుకుంటూ పాత ఫొటోలు తిర‌గేసేది.

త‌న‌లాంటి అనుభ‌వం మ‌రెవ‌రికీ రావ‌ద్ద‌ని పాప‌రాజీ ఫొటోగ్ర‌ఫీ మొద‌లుపెట్టింది.

ప్ర‌తిమ‌లాగే ఆయేషా, సలోనీ, కృతి, రీతూ కూడా పెట్‌ఫొటోగ్ర‌ఫీ చేస్తున్నారు.