13 ఏళ్ల పిల్ల‌లు న‌న్ను రేప్ చేస్తామ‌ని బెదిరించారు

- Simran Budharup

Thick Brush Stroke

స్టార్ ప్ల‌స్ ఛానల్‌లో ప్ర‌సార‌మైన పాండ్యా స్టోర్ ఈ మ‌ధ్యకాలంలో చాలా పాపులారిటీ తెచ్చుకుంది.

Tilted Brush Stroke

సోమ్‌నాథ్‌లో నివ‌సించే మ‌ధ్య‌త‌ర‌గ‌తి పాండ్యా కుటుంబం చుట్టూ తిరిగే క‌థ‌తో ఈ టీవీ షో తెర‌కెక్కింది.

Medium Brush Stroke

ఇందులో రావి, దేవ్ మ‌ధ్య బంధాన్ని విడ‌గొట్టే రిషిత ద్వివేది పాండ్యా అనే నెగెటివ్ పాత్ర‌లో న‌టించింది సిమ్రాన్ బుద్ధ్‌రూప్‌.

Medium Brush Stroke

ఈ టీవీ షోతో సిమ్రాన్‌కు మంచి గుర్తింపే ద‌క్కింది. కానీ ఆ పాత్ర వ‌ల్ల త‌న‌కు బెదిరింపులు కూడా ఎక్కువ‌య్యాయ‌ట‌.

Medium Brush Stroke

మొద‌ట్లో త‌న పాత్ర‌పై వ‌స్తున్న వ్య‌తిరేక‌త  లైట్ తీసుకున్నాన‌ని..  ఈమ‌ధ్య ఆ బెదిరింపులు మ‌రింత ఎక్కువ‌య్యాయ‌ని సిమ్రాన్ పేర్కొంది.

Thick Brush Stroke

కొంత‌మంది పిల్ల‌లు అయితే త‌న‌ను రేప్ చేసి చంపేస్తామ‌ని సోష‌ల్ మీడియాలో బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని పేర్కొంది.

Thick Brush Stroke

ఈ విష‌యంలో పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేసిన‌ట్లు పేర్కొంది.

Thick Brush Stroke

త‌న‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డిన వారంద‌రూ  13-14 వ‌య‌సు లోపు వారేన‌ని చెప్పింది.

Thick Brush Stroke

చ‌దువు కోస‌మ‌ని పిల్ల‌ల‌కు ఫోన్లు ఇస్తుంటే.. వారు ఇలా దుర్వినియోగం చేస్తున్నార‌ని సిమ్రాన్ తెలిపింది.

Thick Brush Stroke

పిల్ల‌లు త‌ల్లిదండ్రుల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేస్తున్నార‌ని సిమ్రాన్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Thick Brush Stroke

ఆ పిల్ల‌ల‌కు మంచి ఏదో.. చెడు ఏదో అర్థం చేసుకునేంత అవ‌గాహ‌న లేదని.. అందుకే ఇలా చేసి ఉంటార‌ని చెప్పింది.

Thick Brush Stroke

అయితే ఆ పిల్ల‌ల‌ను త‌ల్లిదండ్రులే ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ ఉండాల‌ని సూచించింది.