orange health benefits

గ‌ర్భిణులు ఆరెంజ్ జ్యూస్ తాగితే క‌లిగే ప్ర‌యోజ‌నాలు

నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

బిడ్డ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో బిడ్డ పుట్టాక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే విటమిన్ సి వల్ల శరీరం ఐరన్‌ను బాగా గ్రహిస్తుంది. దీంతో త‌ల్లీబిడ్డ ఇద్ద‌రికీ రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది.

నారింజ పండ్లలో ఫోలేట్ కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇది శిశువు ఎదుగుదలకు ఎంతో అవసరం.

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో చాలామందికి హైబీపీ స‌మ‌స్య వ‌స్తుంది. అలాంటి వారు ఆరెంజ్ జ్యూస్ తాగితే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.

శక్తి లేనట్లుగా, నిస్సత్తువగా అనిపించిన‌ప్పుడు ఆరెంజ్ జ్యూస్ తాగితే శక్తి పుంజుకోవచ్చు. ఉత్సాహంగా ఉంటారు.