నయన్ సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇవ్వనుందా
Nayanthara
లేడీ సూపర్‌స్టార్ నయనతారకు ఈ మధ్య ప్రశాంతత లేదనే చెప్పాలి.
విఘ్నేశ్ శివన్‌తో పెళ్లి మొదలు.. సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడం వరకు ఏదో వివాదం చుట్టుముడుతూనే ఉంది.
అంతకుముందు శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం కూడా నయన్‌ను చాలా డిస్ట్రబ్ చేసింది.
కానీ అన్ని వివాదాలను ధైర్యంగా దాటుకుంటూ వచ్చేసింది నయనతార.
ఇన్నేళ్లు ఏదో ఒక టెన్షన్‌తో గడిపేశాం.. ఇప్పుడైనా భర్త, పిల్లలతో కొద్దిరోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని భావిస్తోంది.
అందుకే సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇవ్వాలని నయనతార నిర్ణయం తీసుకుందని సమాచారం.
ప్రస్తుతం షారుక్‌ఖాన్‌తో జవాన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఇది పూర్తికాగానే మాధవన్ హీరోగా వస్తున్న ఒక సినిమాకు నయనతార డేట్స్ ఇచ్చింది. జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.
ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తికాగానే.. కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని హాయిగా గడపాలని నయనతార భావిస్తోంది.
అందుకే ఈలోపు వేరే సినిమాలు, ఎండార్స్‌మెంట్స్ ఒప్పుకోవద్దని నయనతార అనుకుంటున్నది.
తన బర్త్ డేను కూడా ఎలాంటి హడావుడి లేకుండా భర్త, పిల్లలతోనే గడపాలని అనుకుంటున్నట్టు నయన్ సన్నిహితులు చెబుతున్నారు.