ఘనంగా నాగశౌర్య పెండ్లి.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌ నటుడు నాగశౌర్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

White Lightning
White Lightning

బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టి మెడలో నాగశౌర్య మూడు ముళ్లు వేశాడు.

White Lightning

బెంగళూరులోని ఓ స్టార్‌ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.

టాలీవుడ్‌ నుంచి యంగ్‌ హీరోలు నారా రోహిత్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ హాజరయ్యారు.

White Lightning

తాజాగా కృష్ణ వ్రింద విహారి సినిమాతో హిట్‌ అందుకున్న నాగశౌర్య చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారీ నారీ నడుమ మురారి, పోలీసువారి హెచ్చరిక సినిమాల్లో నటిస్తున్నాడు.

White Lightning
White Lightning

ఇక నాగశౌర్య భార్య అనూష శెట్టి విషయానికొస్తే.. ఆమె స్వస్థలం కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందపూర్‌ గ్రామం.

ఇంటీరియర్‌ డిజైనర్‌ అయిన అనూష 2019లో అనూష డిజైన్స్‌ను స్థాపించింది. ఉత్తమ డిజైనర్‌గా అవార్డులు అందుకుంది.

తక్కువ టైమ్‌లోనే ఇండియాలో ప్రముఖ బిజినెస్‌ విమెన్‌గా ఎదిగింది. విమెన్‌ అంత్రప్రెన్యూర్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజిపైకూడా మెరిసింది.