నేను తమన్నాలా ఉంటానని అన్నారు

నచ్చింది గాళ్‌ఫ్రెండూ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయెల్‌.

నచ్చింది గాళ్‌ఫ్రెండూ చిత్ర ట్రైలర్‌ను వెంకటేశ్‌ విడుదల చేయడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.

ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుండటంతో చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న జెన్నిఫర్‌ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

ఈ సినిమాలో బికినీలో కనిపిస్తానని.. అయితే ఆ సీన్లు అందంగా ఉంటాయే తప్ప అసభ్యంగా ఉండవని చెప్పుకొచ్చింది.

ఓ సీన్‌ కోసం రెండు రోజులు తక్కువ ఫుడ్‌ తీసుకున్నానని కూడా జెన్నిఫర్‌ తెలిపింది.

తనలో తమన్నా, కృతిశెట్టి పోలికలు ఉన్నాయని అనడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.

తెలుగులో ఎన్టీఆర్‌, సమంత అంటే ఇష్టమని జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయెల్‌ పేర్కొంది.