Monsoon

వ‌ర్షాకాలంలో ఈ పండ్లు తినండి

Health Tips

చాలామంది వర్షాకాలంలో వేడి వేడి టీనో, మిరపకాయ బజ్జీనో తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ పండ్లు తినడానికి మాత్రం ఆసక్తి చూపరు.

కాలం ఏదైనా పండ్లను తింటే ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా వర్షాకాలంలో దొరికే అన్ని పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Health Tips :

వర్షాకాలంలో ఎక్కువగా దొరికే నేరేడు పండ్లలో కేల‌రీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు నేరేడును తీసుకోవాలి.

Health Tips :

అజీర్ణ సమస్యల్ని కూడా ఇవి తగ్గిస్తాయి. ఇనుము, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి.

Health Tips :

రోగనిరోధక శక్తిని పెంచడంలో దానిమ్మ కీలకపాత్ర పోషిస్తుంది. 

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోజూ ఓ దానిమ్మ తింటే ఆరోగ్యంగా ఉంటారు.

వర్షాకాలంలో జీవక్రియల రేటు కాస్త నిదానంగా ఉంటుంది. అందుకని వర్షాకాలంలో ఆపిల్ ముక్కలు తింటే ఆరోగ్యంగా చురుగ్గా ఉండవచ్చు.

Health Tips :

కొందరు ఆపిల్‌ను పొట్టు తీసి తింటారు. ఇలా తినడం మంచిది కాదు. పొట్టు తీయకుండా తింటే పోషకాలు అందుతాయి.

Health Tips :

అరటిలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. అజీర్తి సమస్య ఉండదు.

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోజూ ఓ పండు తింటే ఆరోగ్యంగా ఉంటారు.

Health Tips :

బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.

Health Tips :

వానాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను బొప్పాయి దూరం చేస్తుంది. ఇందులో పీచు ఎక్కువగా ఉంటుంది.

Health Tips :

బొప్పాయిని మితంగా రోజుకు వంద గ్రాముల వరకు తీసుకుంటేనే మంచిది. అధికంగా తింటే వేడి చేస్తుంది.