మొబైల్ వాడితే మొటిమలు వస్తాయా?
కాల్స్ మాట్లాడినప్పుడు మొబైల్‌ను ముఖం దగ్గర పెట్టుకుంటుంటాం.. దీనివల్ల ఫోన్‌కు ఉన్న బ్యాక్టీరియా మొహంపై చేరి మొటిమల సమస్యకు కారణమవుతుంది.
ఫోన్‌కు చెమట అంటుకుని అది మళ్లీ ముఖానికి చేరి మొటిమల సమస్య మరింత అధికమవుతుంది.
అందుకే కాల్స్ మాట్లాడేటప్పుడు కాస్త దూరంగా పెట్టుకోవాలి. వీలైతే ఇయర్‌ఫోన్స్ వాడాలి.
ఫోన్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మొటిమల సమస్య ఎదురుకాదు.
చర్మాన్ని స్క్రబ్ చేయడం వల్ల ముఖం క్లీన్ అవుతుంది.. కానీ మొటిమలు ఉన్న వారు స్క్రబ్ చేయకోవడం మంచిది.
స్క్రబ్ చేయడం మొటిమలు ఉన్నవారిలో చర్మ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. కాబట్టి స్క్రబ్బింగ్‌కు దూరంగా ఉండాలి.
ముఖం కడగడం వల్ల ఫేస్ క్లీన్ అవుతుంది. మొటిమల సమస్య తగ్గుతుంది. కానీ అతిగా కడగడం ప్రమాదమే.
అతిగా ముఖాన్ని కడగడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తగ్గి సమస్యలు ఎక్కువవుతాయి.
జంక్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం, నిద్రలేమి, టెన్షన్స్ కారణంగా కూడా మొటిమల సమస్య తీవ్రతరమవుతుంది.
మొటిమలు తగ్గాలంటే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి.