Tamanna Bhatia

తన పెండ్లి ఎప్పుడో చెప్పేసిన తమన్నా

మిల్క్‌ బ్యూటీ తమన్నా పెండ్లిపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

White Lightning
White Lightning

ముంబైకి చెందిన బిజినెస్‌మ్యాన్‌తో తమన్నా పెండ్లి పీటలు ఎక్కబోతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

White Lightning

చాలా రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంపై మొదటిసారి తమన్నా నోరు విప్పింది.

గుర్తుందా శీతాకాలం సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న తమన్నా.. తన పెండ్లిపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది.

White Lightning

తన పెళ్లిపై చాలా రూమర్లు వచ్చాయని.. ఒకసారి డాక్టర్‌తో మరోసారి బిజినెస్‌మ్యాన్‌తో పెండ్లి నిర్ణయించేశారని చెప్పుకొచ్చింది తమన్నా.

కానీ అవన్నీ తప్పుడు వార్తలేనని తమన్నా భాటియా కొట్టిపారేసింది.

White Lightning
White Lightning

అందరు అమ్మాయిల్లాగే తన ఇంట్లో కూడా పెండ్లి చేసుకోమని ఫోర్స్‌ చేస్తున్నారని పేర్కొంది.

పెండ్లి అనేది జీవితంలో అందమైన భాగమని.. అలాంటి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ చెప్పే చేసుకుంటానని స్పష్టం చేసింది.

కెరీర్‌ మొదట్లో నటనపై ఎంత కసిగా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని చెప్పుకొచ్చింది.