Manushi Chillar

పెళ్లయిన వ్యక్తితో మాజీ మిస్‌ వరల్డ్‌ ప్రేమాయణం

మాజీ మిస్‌ వరల్డ్ మానుషి చిల్లర్‌ ప్రేమాయణం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

White Lightning
White Lightning

జెరోదా సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన నిఖిల్‌ కామత్‌తో ఆమె కొద్దిరోజులుగా రిలేషన్‌లో ఉందని తాజాగా బయటకొచ్చింది.

White Lightning

ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని.. బాలీవుడ్‌ పార్టీలకు కూడా కలిసే వెళ్తున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది

నిజానికి 2019 నుంచే వీరిద్దరి మధ్య సంబంధం ఉందని.. అయితే ఇప్పటిదాకా ఈ విషయాన్ని చాలా సీక్రెట్‌గా మెయింటైన్‌ చేశారు.

White Lightning

తాజాగా రిషికేశ్‌లో కామత్‌, మానుషి చిల్లర్‌ కలిసి ప్రత్యేక పూజలు చేస్తున్న ఫొటోలు బయటకు రావడంతో వీళ్ల విషయం బయటపడింది.

ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. మానుషి చిల్లర్‌ ప్రియుడు నిఖిల్‌ కామత్‌కు ఇప్పటికే పెళ్లి అయింది.

White Lightning
White Lightning

2019లో అతనికి పెళ్లి అవ్వగా.. గత ఏడాది విడాకులు తీసుకున్నాడు. కానీ అంతకుముందు నుంచే మానుషితో అతనికి సంబంధం ఉంది.

2021 నుంచి కామత్‌, మానుషి ఇద్దరూ తరచుగా విహారయాత్రలకు వెళ్తున్నారని తెలిసింది. 

మరో విషయమేంటంటే.. వీళ్ల ప్రేమాయణం సంగతి ఇరు కుటుంబాలకు తెలుసని సమాచారం.