యువ నటుడితో ప్రేమలో పడ్డ కేరళ బ్యూటీ

సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కేరళ కుట్టి మంజిమా మోహన్‌.

గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిరాశ పరచడంతో మళ్లీ తెలుగులో నటించలేదు మంజిమా.

తమిళంలోనే సినిమాలు చేస్తూ అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఎఫ్‌ఐఆర్‌ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ అందుకుంది.

ఆ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న మంజిమా.. తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

కోలీవుడ్‌ హీరో గౌతమ్‌ కార్తిక్‌తో ప్రేమలో ఉన్నట్లు మంజిమా మోహన్‌ తెలిపింది.

2019లో దేవరత్తం అనే సినిమాలో గౌతమ్‌, మంజిమా కలిసి నటించారు. 

ఆ సినిమా టైమ్‌లో ఏర్పడిన పరిచయం తొలుత స్నేహంగా. ఆ తర్వాత ప్రేమగా మారింది.

ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా మంజిమా మోహన్‌ ప్రకటించింది.

మూడేళ్ల క్రితం నా లైఫ్‌లో అడుగుపెట్టావు. జీవితాన్ని ఎలా చూడాలో నేర్పించావు. అని సోషల్‌మీడియాలో పేర్కొంది.

దిక్కుతోచని పరిస్థితులు ఎదురైనా ప్రతిసారి అందులో నుంచి నన్ను బయటకు తీసుకొచ్చావు అని తెలిపింది.

నాలోని లోపాలను అంగీకరించి.. నాలో నేను ఉండాలని నేర్పించావు.. నాపై కురిపించే ప్రేమ వల్లే నీపై కొండంత ప్రేమను పెంచుకున్నా అని రాసుకొచ్చింది.

అన్నట్టు ఈ కోలీవుడ్‌ హీరో ఎవరో కాదండీ.. సీతాకోక చిలుక, అన్వేషణ, అభినందన వంటి సినిమాలతో ఆకట్టుకున్న కార్తిక్‌ కొడుకే గౌతమ్‌.

కార్తిక్‌ వారసుడిగా కడలి సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్‌.. కోలీవుడ్‌లో మంచి పేరే తెచ్చుకున్నాడు.