గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న‌ మ‌న‌సంతా నువ్వే  చైల్డ్ ఆర్టిస్ట్

సుహాని.. అదేనండీ మ‌న‌సంతా నువ్వే సినిమాలో తూనీగ.. తూనీగ.. అంటూ పాట పాడిన అమ్మాయి గుర్తుందా!

Suhani Kalitha

బాల‌నటిగా ఎంట్రీ ఇచ్చిన సుహానీ.. పెద్ద‌య్యాక హీరోయిన్‌గా కూడా ప‌లు సినిమాల్లో న‌టించింది.

కానీ హీరోయిన్‌గా అంత‌గా గుర్తింపు రాక‌పోవ‌డంతో టాలీవుడ్‌కు దూర‌మైంది సుహానీ.

చాలా ఏండ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ సుహానీ వార్త‌ల్లోకి వ‌చ్చింది. తాజాగా ఈమె పెండ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మ్యూజిషీయ‌న్‌, టెడ్ఎక్స్ స్పీక‌ర్ విభ‌ర్ హ‌సీజాను సుహానీ పెండ్లి చేసుకుంది.

బాల రామాయ‌ణం సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన సుహానీ.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రేమంటే ఇదేరా, గ‌ణేశ్‌, మ‌న‌సంతా నువ్వే, ఎలా చెప్ప‌ను వంటి ప‌లు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది.

తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, బెంగాలీ భాష‌ల్లోనూ ఆఫ‌ర్లు రావ‌డంతో అక్క‌డ కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌లు సినిమాలు చేసింది.

ఆ త‌ర్వాత ప‌లు యాడ్స్‌లోనూ న‌టించింది సుహానీ క‌లిత‌.

2008లో వ‌చ్చిన స‌వాల్ సినిమాతో సుహానీ హీరోయిన్‌గా మారింది. కానీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చిన గుర్తింపు హీరోయిన్‌గా రాలేదు.

2010లో చివ‌రిసారిగా స్నేహ‌గీతం సినిమాలో క‌నిపించిన సుహానీ.. ఆ త‌ర్వాత టాలీవుడ్‌కు దూర‌మైంది.

ఇప్పుడు ఇన్నేండ్ల‌కు పెండ్లి ఫొటోల‌తో వార్త‌ల్లోకి ఎక్క‌డంతో చిన్న‌ప్ప‌టి తూనీగ‌.. తూనీగ అమ్మాయిని గుర్తు చేసుకుంటున్నారు.