క్యాన్సర్‌ వస్తే ఇలా ఉంటానా?

యమదొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మలయాళ బ్యూటీ మమతా మోహన్‌దాస్‌.

ఒకటి రెండు సినిమాల తర్వాత టాలీవుడ్‌కి దూరమైన మమతా.. మలయాళ సినిమాలకే పరిమితమైంది.

ఆ సమయంలోనే క్యాన్సర్‌ బారిన పడిన ఆమె.. ధైర్యంగా మహమ్మారితో పోరాడింది.

క్యాన్సర్‌ను జయించిన తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది మమతా మోహన్‌ దాస్‌.

అయితే మమతా మోహన్‌దాస్‌కు మళ్లీ క్యాన్సర్‌ తిరగబెట్టిందనే వార్తలు జోరందుకున్నాయి.

ఈ వార్తలపై మమతా మోహన్‌దాస్‌ సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యింది.

నా ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు. అవి చూసి నా ఫ్రెండ్స్‌, బంధువులు ఆందోళన చెంది నాకు ఫోన్‌ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది.

అవన్నీ ఫేక్‌ వార్తలు, రూమర్స్‌ అని.. వాటిని నమ్మకండి అంటూ అసలు విషయాన్ని చెప్పింది.

సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్‌ చేస్తూ.. క్యాన్సర్‌ వస్తే ఇలా ఉంటానా అని ప్రశ్నించింది.

ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, చాలా సంతోషంగా లైఫ్‌ను గడుపుతున్నానని స్పష్టం చేసింది మమతా మోహన్‌దాస్

తన ఆరోగ్యం గురించి ఎలాంటి వార్త అయినా తానే చెప్తానని స్పష్టం చేసింది.

డబ్బుల కోసం, వ్యూస్‌ కోసం ఇలాంటి వార్తలు రాస్తున్నారని.. వారికి ఇలాంటి పరిస్థితి వస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.

నిజం తెలుసుకోవాలని ఈ వార్తలను తన దృష్టికి తీసుకొచ్చిన వాళ్లకు ధన్యవాదాలు తెలిపింది.