నయనతారపై విఘ్నేశ్‌ శివన్‌ తల్లి సెన్సేషనల్‌ కామెంట్స్‌

నయనతార గురించి ఆమె అత్త, విఘ్నేశ్‌ శివన్‌ తల్లి మీనా కుమారి షాకింగ్‌ విషయాలు చెప్పింది.

తన కోడలు నయనతార మనస్సు చాలా గొప్పదని మీనాకుమారి పొగడ్తలతో ముంచెత్తింది.

White Lightning

తన కొడుకు సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అని.. కోడలు స్టార్‌ హీరోయిన్‌ అని.. వాళ్లిద్దరూ ఎంతో కష్టపడి పనిచేస్తారని చెప్పుకొచ్చింది. 

తన కొడుకు, కోడలు ఇద్దరూ కష్టపడి పనిచేయడమే కాదు.. కష్టపడి పనిచేసేవాళ్లను కూడా అంతే గౌరవిస్తారని పేర్కొంది.

White Lightning
White Lightning

తన కొడుకు ఇంట్లో 8 మంది పనివాళ్లు ఉంటారని చెప్పింది. అయితే వారిలో ఒకరికి 4 లక్షల వరకు అప్పు ఉందని తన కోడలు నయన్‌కి తెలిసిందట.

వెంటనే ఆ పని మనిషికి రూ.4లక్షలు డబ్బు ఇచ్చి బాకీలు కట్టేయమని చెప్పిందట. ఈ విషయాన్ని విఘ్నేశ్‌ శివన్‌ తల్లి మీడియా ముందు బయటపెట్టింది. 

ఇంట్లో పనిచేసేవాళ్లకు అంతపెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి సాయం చేసేందుకు ఎంతో దయా హృదయం ఉండాలని మెచ్చుకుంది.

White Lightning