ఇకపై అలాంటి పాత్రలు చేయను

శరత్‌కుమార్‌ వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ శరత్‌కుమార్‌.

పదేళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చిన వరలక్ష్మీ.. ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది.

క్రాక్‌ సినిమా చూసిన తర్వాత వరలక్ష్మీ కంటే కూడా జయమ్మ అనే ఆడియన్స్‌ గుర్తుపెట్టుకున్నారు.

అంతకుముందు తమిళంలో పందెంకోడి 2, సర్కార్‌ సినిమాల్లో లేడీ విలన్‌గా దుమ్ముదూలిపింది

రీసెంట్‌గా యశోద లో నెగెటివ్‌ షేడ్స్‌లో కనిపించిన వరలక్ష్మీ.. తాజాగా వీరసింహారెడ్డి సినిమాలో అలాంటి రోల్‌లోనే నటించింది.

ఈ క్రమంలో నెగెటివ్‌ క్యారెక్టర్స్‌లో ఎందుకు నటిస్తుందో కారణాన్ని వివరించింది 

తనకు గ్లామర్ రోల్స్‌ అంతగా సూట్‌ కావని తన అభిప్రాయమని వరలక్ష్మీ శరత్‌కుమార్‌ చెప్పింది.

అయినా సినిమాల్లో గ్లామర్‌ రోల్స్‌ చేయడానికి చాలామంది ఉన్నారని.. ఇకపై అలాంటి పాత్రలు చేయనని స్పష్టం చేసింది.

తనకు విలన్‌ పాత్రల్లో నటించడం ఇష్టమని.. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నటిస్తానని పేర్కొంది.