- Samyuktha Menon

అప్పుడు నాకు యాక్టింగ్‌  రాద‌న్నారు : సంయుక్త

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది మ‌ల‌యాళ కుట్టి సంయుక్త మీన‌న్.

White Lightning
White Lightning

ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంది సంయుక్త మీన‌న్‌.

White Lightning

సాయితేజ్ 15లో సంయుక్త మీన‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. నిజానికి భీమ్లా నాయ‌క్ కంటే వారం ముందే ఈ సినిమాకు సంత‌కాలు చేసింది.

అలాగే ధ‌నుష్‌తో క‌లిసి ద్విభాషా చిత్రం సార్‌లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఒక పాట మిన‌హా మిగిలిన సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

White Lightning

త్వ‌ర‌లోనే క‌ళ్యాణ్ రామ్ బింబిసార‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతుంది సంయుక్త మీన‌న్‌.

ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో బిజీగా ఉన్న సంయుక్త‌.. కెరీర్ తొలినాళ్ల‌లో ఎదురైన స‌వాళ్లు, విమ‌ర్శ‌ల గురించి చెప్పుకొచ్చింది.

White Lightning
White Lightning

ఒక‌ప్పుడు ఉద్యోగంలో స్థిర‌ప‌డ‌ట‌మే త‌న ఏకైక ల‌క్ష్యంగా ఉండేద‌ని చెప్పిన సంయుక్త‌..  అనుకోకుండా సినిమాల్లోకి వ‌చ్చాన‌ని గుర్తు చేసుకుంది.

2016లో పాప్‌కార్న్ సినిమాతో మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాన‌ని.. అదే త‌న తొలి సినిమా అని తెలిపింది.

ఈ సినిమాలో త‌న యాక్టింగ్ చూసి చాలా చెత్త‌గా చేశావ‌ని విమ‌ర్శించార‌ని గుర్తుచేసుకుంది.

వాస్త‌వానికి నాకు అప్ప‌టికి సినిమాల గురించి అంత‌గా తెలియ‌దు.. స్క్రిప్ట్ గురించి అవ‌గాహ‌న లేద‌ని తెలిపింది.

అప్ప‌టికి ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నా.. కానీ ఏదో అవ‌కాశం వ‌చ్చింది క‌దా అని క్యాజువ‌ల్‌గా న‌టించాన‌ని చెప్పుకొచ్చింది.

ఆ చిత్రం త‌ర్వాతే సినిమా ఇండ‌స్ట్రీపై అవ‌గాహ‌న వ‌చ్చింద‌ని సంయుక్త మీన‌న్ పేర్కొంది.

White Lightning
White Lightning

ఏ భాష‌లో న‌టించినా సొంతంగా డ‌బ్బింగ్ చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తా.. అప్పుడే న‌టిగా పూర్తి సంతృప్తి దొరుకుతుంద‌ని చెప్పింది.

White Lightning
White Lightning

అందుకే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి ముందే.. ప్ర‌త్యేకంగా ట్యూట‌ర్‌ను పెట్టుకుని మ‌రి తెలుగు నేర్చుకున్నా అని తెలిపింది.

White Lightning
White Lightning