ఇన్‌స్టాలో ఫొటోలన్నీ డిలీట్ చేసిన మంజిమా మోహన్
కోలీవుడ్ యంగ్ హీరో గౌతమ్ కార్తీక్‌తో ప్రేమలో ఉన్నట్లు మంజిమా మోహన్ ఇటీవల ప్రకటించింది.
2019లో విడుదలైన దేవరాట్టం సినిమా సమయంలో వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
ఇప్పుడు ఈ ప్రేమను మరో అడుగు ముందుకు తీసుకెళ్లబోతున్నారు మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్.
ఈ నెల 28న చెన్నై సమీపంలోని ఓ స్టార్ హోటల్‌లో వీరి వివాహం జరగనున్నట్టు సమాచారం.
పెండ్లి ఫిక్సయిన నేపథ్యంలో మంజిమా మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని ఫొటోలు అన్నింటినీ డిలీట్ చేసింది.
ఇన్‌స్టాలో గౌతమ్ కార్తీక్‌తో ఉన్న ఫొటోలు కాకుండా అన్నింటినీ డిలీట్ చేసింది మంజిమా.
అకస్మాత్తుగా మంజిమా ఫొటోలు డిలీట్ చేయడంతో అభిమానులు షాకయ్యారు. పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.
అయితే ఫొటోలు డిలీట్ చేయడంపై మంజిమా మోహన్ క్లారిటీ ఇచ్చింది.
కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నా కాబట్టి పాత జ్ఞాపకాలను చూసుకుని బాధపడొద్దనే ఇన్‌స్టాలో ఫొటోలు డిలీట్ చేశానని తెలిపింది.
కొత్త జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను భద్రపరచుకోవడానికి చోటు కూడా అవసరమని చెప్పుకొచ్చింది.