గర్భిణులే కాదు వీళ్లు కూడా బొప్పాయి తినొద్దు

Papaya

1

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నది. కానీ కొంతమంది మాత్రం దీన్ని అసలు తినకూడదు.

ఆస్తమా, హై ఫీవర్, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండాల్సిందే.

ఎందుకంటే బొప్పాయిలో పపైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఎలర్జీ కలిగిస్తుంది. ఇంకా సమస్యలు పెంచుతుంది.

బొప్పాయి తింటే షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఎక్కువగా తింటే షుగర్‌ లెవల్స్‌ టూమచ్‌గా పడిపోయే అవకాశం ఉంటుంది.

బొప్పాయిలో బీటా కెరోటిన్‌ ఉండటం వల్ల ఇది చర్మం రంగు తేలేలా చేస్తుంది. కానీ అతిగా తింటే తెల్ల, పసుపు మచ్చలకు కారణమవుతుంది.

గర్భిణులు బొప్పాయిని తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తింటే కడుపులోని బిడ్డకు ప్రమాదం.

బొప్పాయిలో విటమిన్‌ సీ అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తింటే రెనాల్‌ స్టోన్స్‌ సమస్య వస్తుంది.