రెమ్యున‌రేష‌న్ డ‌బుల్ చేసిన‌ కేజీఎఫ్ బ్యూటీ

- Srinidhi Shetty

కేజీఎఫ్ సినిమాతో కుర్ర‌కారు మ‌న‌సు దోచుకుంది శ్రీనిధి శెట్టి.

ఈ సినిమాలో త‌న అందంతో పాటు అభిన‌యంతోనూ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది.

Srinidhi Shetty

రాఖీ భాయ్‌కి ధీటుగా త‌న పొగ‌రును చూపిస్తూ ఆడియ‌న్స్‌ను మెస్మ‌రైజ్ చేసింది.

SRInidhi Shetty

అంత‌లా త‌న న‌ట‌న‌తో ఫిదా చేసింది కాబ‌ట్టే ఒక్క సినిమాతోనే శ్రీనిధికి క్రేజ్ పెరిగిపోయింది.

దీపం ఉన్నప్పుడే ఇల్లు స‌క్క‌బెట్టుకోవాల‌న్న చందంగా క్రేజ్ ఉన్న టైమ్‌లోనే సంపాదించుకోవాల‌ని ఫిక్స‌యింది శ్రీనిధి శెట్టి.

అందుకే రెండో సినిమాకే త‌న రెమ్యున‌రేష‌న్‌ను రెండింత‌లు చేసేసింది శ్రీనిధి శెట్టి.

చియాన్ విక్ర‌మ్ హీరోగా వ‌స్తున్న కోబ్రా సినిమాతో శ్రీనిధి కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న‌ది.

Srinidhishetty

త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో  శ్రీనిధి రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు అంత‌టా ట్రెండింగ్‌గా మారింది.

కేజీఎఫ్ కోసం శ్రీనిధి శెట్టి రూ.3 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంది. ఈ సినిమా స‌క్సెస్ కావ‌డంతో ఇప్పుడు పారితోషికం డబుల్ చేసింది.

కోబ్రా సినిమా కోసం రూ.6 నుంచి 7 కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేసింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

చిత్ర యూనిట్ కూడా శ్రీనిధి డిమాండ్‌కు పాజిటివ్‌గానే స్పందించి అడిగినంత ఇచ్చేందుకు ఒప్పుకున్నార‌ని తెలుస్తోంది.