షూటింగ్‌లో 

న‌న్ను ర‌ష్మిక ర‌ష్మిక  అని పిలిచేవారు

By Marco Christiansen | Jun 21, 2021

#Keerthy suresh

మ‌హాన‌టి త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కోసం చూస్తోంది కీర్తి సురేశ్‌.

Keerthy Suresh

మ‌హాన‌టి త‌ర్వాత చాలా సినిమాలు చేసినా చెప్పుకోద‌గ్గ హిట్స్ మాత్రం కీర్తికి ద‌క్క‌లేవు.

అందుకే ఇప్పుడు ఆమె ఆశ‌లన్నీ మ‌హేశ్‌బాబు స‌ర్కారు వారి పాట సినిమాపై ఉన్నాయి.

ఈ సినిమాలో గ‌తంలో కంటే కొత్త‌గా క‌నిపించ‌బోతుంద‌ని ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ చూస్తే అర్థ‌మైపోతుంది.

మే 12న స‌ర్కారు వారి పాట సినిమా విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో శ‌నివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.

ఈ ఈవెంట్‌లో పాల్గొన్న కీర్తి సురేశ్‌.. మ‌హేశ్‌బాబు, డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్‌ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పింది.

క‌ళావ‌తి క్యారెక్ట‌ర్‌ను త‌న‌కు బ‌హుమతిగా ఇచ్చినందుకు ముందుగా ప‌రశురామ్‌కు కీర్తి సురేశ్‌ థ్యాంక్స్ చెప్పింది.

షూటింగ్ స‌మ‌యంలో డైరెక్ట‌ర్ త‌న పేరు మ‌ర్చిపోయి ర‌ష్మిక ర‌ష్మిక అని పిలిచేవార‌ని బ‌య‌ట‌పెట్టింది.

మ‌రి ర‌ష్మిక‌తో సినిమా చేసేట‌ప్పుడు త‌న‌ను నా పేరుతో పిలుస్తారో లేదో చూడాల‌ని చెప్పింది.

ఇక మ‌హేశ్ బాబుతో క‌లిసి ప‌నిచేయ‌డం త‌న అదృష్ట‌మ‌ని కీర్తి సురేశ్ తెలిపింది.

మ‌హేశ్ బాబుతో టైమ్ మేనేజ్ చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌ని.. ఆయ‌న గ్లామ‌ర్‌ను ఎలా మేనేజ్ చేయాలో తెలియ‌క టెన్ష‌న్ ప‌డ్డాన‌ని చెప్పుకొచ్చింది.

మ‌హేశ్ రియ‌ల్ లైఫ్ క‌ళావ‌తి త‌న‌ను చాలా స‌పోర్ట్ చేశారని.. ఆమెకు థ్యాంక్స్ చెప్పారు.