సమంతకు ఉన్న వ్యాధే నాకూ ఉంది

ఇటీవల మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చింది సమంత.

నిల్చున్న, కూర్చొన్న.. ఏ చిన్న పని చేసినా అలసిపోయే ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత చెప్పడంతో అందరూ సంతాపం తెలిపారు.

samantha

సమంత తొందరగా కోలుకోవాలని సెలబ్రెటీలు, ఫ్యాన్స్‌ అందరూ కోరుకున్నారు.

ఇలాంటి సమయంలోనే సమంత నటించిన యశోద సినిమా విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది.

ఈ క్రమంలో యశోద సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న కల్పిక గణేశ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది.

Kalpika ganesh

సక్సెస్‌ మీట్‌లో సమంతను చాలా మిస్సవుతున్నామని కల్పికా గణేశ్‌ చెప్పుకొచ్చింది.

kalpika ganesh

kalpika ganesh

సమంత ఈ మీట్‌కు వస్తుందని చెప్పిందని.. అందుకే తను ఆస్పత్రిలో అపాయింట్‌మెంట్‌ కూడా క్యాన్సిల్‌ చేసుకుని వచ్చానని తెలిపింది.

13 ఏండ్లుగా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నానని.. సమంతకు ఉన్న మయోసైటిస్‌ వ్యాధి తనకు కూడా ఉందని పేర్కొంది.

kalpika ganesh

kalpika ganesh

సమంత మూడో స్టేజిలో ఉందని.. తన మాత్రం మొదటి దశలో ఉన్నానని చెప్పుకొచ్చింది.

kalpika ganesh

దీని గురించి సమంతను కలిసి మాట్లాడుదామని అనుకుంటున్నానని చెప్పింది. సమంత త్వరగా కోలుకోవాలని అభిలాషించింది.