బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మరో స్టార్‌ కిడ్‌

Nyasa devgn

సినీ ఇండస్ట్రీలోకి మరో వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఇప్పటికే జాన్వీకపూర్‌, సోహా అలీఖాన్‌, అనన్య పాండే, శ్రద్ధాకపూర్‌, ఆలియా భట్‌ ఇలా చాలామంది స్టార్‌ కిడ్స్‌ బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు.

వీరి బాటలోనే షారుక్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ కూడా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా అజయ్‌ దేవగణ్‌, కాజోల్‌ల గారాలపట్టి నైసా దేవగణ్‌ కూడా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు వచ్చిన నైసా.. బాలీవుడ్‌లో వరుసగా పార్టీలకు హాజరవుతోంది.

మిగిలిన స్టార్‌ కిడ్స్‌తో కలిసి బాలీవుడ్‌ పార్టీల్లో రచ్చ చేస్తోంది. 

ఇది చూసిన బీటౌన్‌ వర్గాలు.. నైనా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కోసమే ఇలా నలుగురి దృష్టిని ఆకర్షిస్తోందని అంటున్నారు.

అంతేకాదు నైనా కోసం కాజోల్‌ కథలు కూడా వింటుందని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కానీ నైసా బాలీవుడ్‌ ఎంట్రీ గురించి అటు కాజోల్‌, ఇటు అజయ్‌ దేవగణ్‌ ఇద్దరూ ఇప్పటివరకైతే స్పందించలేదు.