రాత్రి కూడా అవే కలలు వచ్చేవి : జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినిమాల్లోకి వచ్చింది జాన్వీకపూర్‌.

స్టార్‌ కిడ్‌గా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం జాన్వీ తాపత్రయపడుతోంది.

గ్లామర్‌ రోల్స్‌ కంటే కూడా నటనా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకెళ్తోంది.

ఈ క్రమంలోనే ఆమె నటించిన మిలి సినిమా నవంబర్‌ 4న రిలీజ్‌ కాబోతోంది. మలయాళ హిట్‌ హెలెన్‌ సినిమాకు రీమేక్‌ ఇది.

ఇందులో 16 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్న ఒక పెద్ద ఫ్రిజ్‌లో ఇరుక్కుపోయే పాత్రలో జాన్వీ కపూర్‌ నటించింది.

ఆ పాత్ర కోసం జాన్వీకపూర్‌ ఎంతో వర్కవుట్‌ చేసింది. తన రోల్‌కు 100 పర్సెంట్‌ న్యాయం చేసేందుకు ఎంతగానో కష్టపడింది.

ఈ పాత్రకు సెట్‌ అయ్యేందుకు జాన్వీ కపూర్‌ 7.5 కిలోల బరువు పెరిగింది కూడా.

ఈ క్రమంలో సినిమా కోసం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఇబ్బంది పడ్డానని జాన్వీ తెలిపింది.

రోజూ పడుకునేప్పుడు ఫ్రిజ్‌లో ఇరుక్కుపోయినట్టుగానే కలలు వచ్చేవని.. దాని వల్ల సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదని జాన్వీ పేర్కొంది.

ఈ పీడకలల వల్ల నిద్రలేక.. ఆరోగ్యం దెబ్బతిన్నదని.. మూడు రోజులు పెయిన్‌ కిల్లర్స్‌ కూడా వాడానని చెప్పుకొచ్చింది.