గాలోడు సినిమాకు సుధీర్‌ రెమ్యునరేషన్‌ ఎంతంటే

జబర్దస్త్‌ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు

సుధీర్‌కు కర్ణాటకలో కూడా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

స్టార్‌ హీరో రేంజిలో ఫ్యాన్‌ బేస్‌ ఉండటంతో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు సుడిగాలి సుధీర్‌.

సాఫ్ట్‌వేర్‌ సుధీర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత త్రీమంకీస్‌ చిత్రంతో అలరించాడు.

అయితే ఆ రెండు సినిమాలు కూడా సుధీర్‌ను హీరోగా నిలబెట్టేందుకు ఉపయోగపడలేదు

ఎలాగైనా  హీరోగా నిలదొక్కుకునే క్రమంలో గాలోడు అనే మాస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు

నవంబర్‌ 18న రిలీజైన గాలోడు మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ క్రమంలో గాలోడు సినిమాకు సుధీర్ తీసుకున్న రెమ్యునరేషన్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

గాలోడు సినిమా కోసం సుధీర్‌ సుమారు 40 నుంచి 50 లక్షల వరకు తీసుకున్నట్టు సమాచారం.

ఒక అప్‌కమింగ్‌ హీరోకు ఇది భారీ రెమ్యునరేషన్‌ అయినప్పటికీ సుధీర్‌ క్రేజ్‌కు తక్కువే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.