Yadamma Raju Engagement

ప్రియురాలితో యాదమ్మ రాజు ఎంగేజ్‌మెంట్‌

పటాస్‌ షోతో పాపులారిటీ తెచ్చుకున్న బుల్లితెర కమెడియన్‌ యాదమ్మ రాజు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

తాను ప్రేమించిన అమ్మాయి షారోన్‌ స్టెల్లాతో యాదమ్మ రాజు పెండ్లికి సిద్ధమయ్యాడు. 

కుటుంబసభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల మధ్య యాదమ్మ రాజు నిశ్చితార్థం జరిగింది.

ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను యాదమ్మ రాజు ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో విషయం అందరికీ తెలిసింది.

ఎంగేజ్‌మెంట్‌ విషయం తెలిసి యాదమ్మ రాజు - షార్లీ స్టెల్లా జంటకు బుల్లితెర నటులు, ఆడియన్స్‌ శుభాకాంక్షలు చెబుతున్నారు.

షార్లీ స్టెల్లాతో ప్రేమలో ఉన్నట్టు గతంలోనే ఒక టీవీ షోలో యాదమ్మ రాజు రివీల్‌ చేశాడు.

అప్పట్నుంచి పలు టీవీ షోల్లో కనిపించడమే కాదు.. ఇద్దరూ కలిసి యూట్యూబ్‌ రీల్స్‌తో అదరగొట్టారు.