సుధీర్‌తో రిలేషన్‌పై రష్మీ అలా చెప్పిందేంటి
సుధీర్, రష్మి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ప్రేమా? స్నేహమా? ఈ డౌట్ టాలీవుడ్‌లో చాలామందికి ఉంది.
జబర్దస్త్‌లో అప్పుడే ప్రేమ అన్నట్టుగా కనిపించిన వీళ్లు.. తమది స్నేహబంధమేనని చెబుతుంటారు. ఇంతలో లవ్‌బర్డ్స్‌లా కనిపిస్తారు.
ఇంతకీ వీళ్ల మధ్య బంధమేంటి? తెలుసుకోవాలని చాలామందిలో కుతూహలం ఉంది.
ఈ క్రమంలోనే నందూతో రష్మి నటించిన బొమ్మ బ్లాక్‌బస్టర్ చిత్రం ప్రమోషన్‌లో పాల్గొన్న ఆమెకు ఇదే విషయంలో ప్రశ్న ఎదురైంది.
సుధీర్, రష్మీ మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా? ఏంటి అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవ్వడంతో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.
మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావచ్చు.. ప్రతి ఒక్కరికీ వివరించలేనని జబర్దస్త్ యాంకర్ రష్మి బదులిచ్చింది.
అందరికీ వివరిస్తూ పోతే అది నా జీవితం ఎలా అవుతుంది? అన్ని చెప్పాల్సిన అవసరం లేదని.. అవన్నీ వ్యక్తిగతమని చెప్పింది
కొన్ని విషయాలు తనలోనే దాచుకుంటానని.. భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు కదా అని తెలిపింది.
ఏం జరిగినా అది తప్పకుండా మీ అందరికీ తెలుస్తుందంటూ చెప్పుకొచ్చింది.
మేమిద్దరం ఆఫ్ స్క్రీన్‌లో ఎలా ఉంటామో.. అదే ఆన్‌స్క్రీన్‌పై కనిపిస్తుందని రష్మి తెలిపింది.
తమది పదేళ్ల ప్రయాణమని.. అనుకుని అదంతా చేయలేదని.. ఓ మ్యాజిక్‌ల తమ కెమిస్ట్రీ అందర్నీ ఆకర్షిస్తోందని తెలిపింది.
భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని రష్మి చెప్పిన సమాధానం విన్న తర్వాత.. అలా చెప్పిందేంటి అని ఫ్యాన్స్ ఒకింత షాకవుతున్నారు.
సుధీర్, రష్మి మధ్య ఉన్నది ఏ రిలేషన్ అయినా సరే.. వాళ్ల కెమిస్ట్రీకి మాత్రం చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు