నన్ను మైదాబాల్‌ అని పిలిచేవారు : ఐశ్వర్య మీనన్‌

లవ్‌ ఫెయిల్యూర్‌ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కోలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యమీనన్‌.

White Lightning
White Lightning

మొదటి సినిమాతో మంచి గుర్తింపే తెచ్చుకుంది ఐశ్వర్య మీనన్‌. ఆ సినిమా తర్వాత కోలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు చేసింది.

White Lightning

కన్నడ, మలయాళ ఇండస్ట్రీల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఐశ్వర్య మీనన్‌.. ఇప్పుడు టాలీవుడ్‌కు అడుగుపెడుతుంది.

సిద్ధార్థ్‌ నిఖిల్‌ హీరోగా వస్తున్న స్పై సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.

White Lightning

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య మీనన్‌.. తనకు ఎదురైన బాడీ షేమింగ్‌ అనుభవాలను బయటపెట్టింది. 

చిన్నతనంలో లావుగా ఉండటం వల్ల ఎంతోమంది విమర్శలు చేసేవారని.. వాటి వల్ల ఎంతో బాధపడ్డానని చెప్పింది.

White Lightning
White Lightning

ఇప్పుడు ఇంత ఫిట్‌గా ఉండటానికి ఆ విమర్శలను తట్టుకుని నిలబడటమేనని చెప్పుకొచ్చింది ఐశ్వర్య మీనన్‌.

చిన్నతనంలో తనను చూసి అందరూ ఎగతాళి చేసేవారని.. కొందరైతే మైదాబాల్‌ అంటూ తనపై జోకులు వేసుకునేవారని తెలిపింది.

ఆ కామెంట్లు తనకు ఎంత చికాకు తెప్పించినప్పటికీ స్పందించేదాన్ని కాదని.. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది.

అందువల్లే ఫిట్‌నెస్‌ మెయింటైన్‌ చెయ్యాలని డిసైడ్‌ అయ్యానని.. 16 ఏండ్ల వయసులో వర్కవుట్స్‌ మొదలు పెట్టానని తెలిపింది ఐశ్వర్య మీనన్‌.

ఫిట్‌నెస్‌ ప్రయాణం మొదలుపెట్టాక అన్నీ మారిపోయాయని.. ఇప్పుడు ఫిట్‌నెస్‌ తన లైఫ్‌స్టైల్‌గా మారిందని చెప్పింది.

ఎప్పుడూ తనను ఎగతాళి చేసిన వారందరికీ ఐశ్వర్య మీనన్‌ థ్యాంక్స్‌ చెప్పింది.