ముంబైకి మ‌కాం  మార్చేస్తుందా?

స‌మంత 

అప్ప‌ట్లో కూడా ఇదే ప్ర‌శ్న తెర‌పైకి వ‌చ్చింది. కానీ వాటిని స‌మంత ఖండించింది. హైద‌రాబాద్ ఎప్ప‌టికీ త‌న ఇళ్ల‌ని స్ప‌ష్టం చేసింది.

SAMANTHA

కానీ ఇటీవ‌ల కాలంలో స‌మంత హైద‌రాబాద్ కంటే ఎక్కువ‌గా ముంబైలోనే క‌నిపిస్తుంది.

య‌శోద సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు కూడా ముంబై నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చి వెళ్తుంద‌ట‌.

నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత కెరీర్‌పై ఫోక‌స్ పెట్టిన స‌మంత‌.. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ బిజీ కావాల‌ని చూస్తుంద‌ట‌.

అందుకోస‌మే ముంబైకి మకాం మార్చాల‌ని సామ్ అనుకుంటుంద‌ట‌. అందుకే త‌న పాత మేనేజ‌ర్‌ను తీసేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు స‌మంత‌, నాగ‌చైత‌న్య ఇద్ద‌రికీ ఒకే మేనేజ‌ర్ ఉన్నాడు. విడాకుల త‌ర్వాత కూడా అదే మేనేజ‌ర్‌ను కొన‌సాగించింది సామ్‌.

samantha

samantha

కానీ ఇప్పుడు ముంబైకి ప‌రిమితం కావాల‌ని అత‌న్ని తీసేసింద‌ట‌. అంతేకాదు ముంబైలో ఖ‌రీదైన బిల్డింగ్‌ను కూడా కొనుగోలు చేసింద‌ని స‌మాచారం.

హిందీ వెబ్ డ్రామాల‌తో పాటు బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేయాల‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ట‌.

స‌మంత ముంబైకి మ‌కాం మారుస్తుంద‌న్న ఈ వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.