పవన్ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందా?

కన్నడ సోయగం పూజా హెగ్డేకు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు.

మొన్నటివరకు వరుస హిట్స్‌తో ఉన్న పూజాకు.. ఇప్పుడు వరుస ప్లాప్‌లు ఎదురవుతున్నాయి.

బీస్ట్‌, రాధేశ్యామ్‌, ఆచార్య సినిమాలు వరుసగా ప్లాప్‌ అవ్వడంతో పూజా హెగ్డేకు ఐరెన్‌ లెగ్ ముద్ర పడిపోయింది.

దీంతో పూజా హెగ్డేను చాలామంది స్టార్స్‌ దూరం పెడుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను గతంలో భవదీయుడు భగత్‌ సింగ్‌ పేరుతో ప్రకటించినప్పుడు పూజాను హీరోయిన్‌ అనుకున్నారు.

కానీ వేరే సినిమాలు కమిట్‌ అవ్వడంతో ఈ సినిమా షూటింగ్‌ ఆలస్యమైంది.

తాజాగా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌గా పేరు మార్చుకుని సెట్స్‌ మీదకు వెళ్లేందుకు సిద్ధమైంది.

 సినిమా ఆలస్యం కావడంతో డేట్స్‌ అడ్జస్ట్‌ కాక పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి

వరుస డిజాస్టర్‌లు పడటంతో కావాలనే పూజాను తప్పించారనే టాక్‌ కూడా నడుస్తోంది.