ఫ్రెంచ్ ఫ్రైస్ ఆరోగ్యానికి మంచివా? కావా?

#French Fries

ఫ్రెంచ్‌ఫ్రైస్.. అమెరికాలో ఇది ఫేమస్ ఫుడ్. ప్రస్తుతం మన దగ్గర ఫేమస్ స్నాక్. వీటిని ఎక్కువగా తినే వారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయట. అవేంటంటే..

ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఆయిల్‌లో వేసి ఎక్కువ‌సేపు ఉడక‌బెడ‌తారు. కాబ‌ట్టి ఇవి రుచికరంగా ఉన్న‌ప్ప‌టికీ ఆరోగ్యానికి హాని చేస్తాయి.

ఫ్రెంచ్ ఫ్రైస్‌లో పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి జీర్ణం కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. దీంతో కొవ్వు పేరుకుపోయి బ‌రువు పెరుగుతారు.

ఆలుగడ్డ‌ల‌ను నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. దీంతో గుండె జ‌బ్బులు, టైప్ -2 డ‌యాబెటిస్ బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌.

ప్రతి రోజు అల్పాహారంగా కొన్ని రోజుల పాటు తీసుకుంటే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది.

ఫ్రెంచ్ ఫ్రైస్‌లో ఉప్పు అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం ద్వారా  బీపీ పెరుగుతుంది. దీంతో భవిష్యత్‌లో హార్ట్ ఎటాక్, కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.